deepika padukune: ‘పద్మావతి’ సినిమా విడుద‌ల‌పై క‌ర్ణిసేన హెచ్చ‌రిక‌లు.. స్పందించిన హీరోయిన్ దీపికా ప‌దుకునే

  • ఈ సినిమా కోసం నా జీవితంలో అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించా
  • ఆందోళ‌న‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను
  • ఇది సిగ్గుపడాల్సిన విషయం
  • రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు

సంజయ్‌లీలా భన్సాలీ దర్శ‌కత్వం వ‌హించిన‌ ‘పద్మావతి’ సినిమాను వ‌చ్చేనెల 1న విడుద‌ల చేయడానికి నిర్మాత ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సినిమాను విడుద‌ల చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సిందేన‌ని క‌ర్ణిసేన హెచ్చరిక‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో న‌టించిన హీరోయిన్ దీపికా ప‌దుకునేని చంపాల‌ని కూడా వ్యాఖ్యానించింది. ఈ వివాదంపై దీపికా ప‌దుకునే స్పందించింది.

ప‌ద్మావ‌తి సినిమా కోసం తన జీవితంలో అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించానని తెలిపింది. ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో జరుగుతోన్న‌ వివాదాలను, ఆందోళ‌న‌ల‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. సినిమాపై ఇంతటి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సినిమాలో న‌టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని చెప్పింది. త‌న సినిమా విడుద‌ల‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.  

  • Loading...

More Telugu News