silpa mohan reddy: శిల్పా సోదరులకు గన్ మెన్ల తొలగింపు.. భూమా, ఎస్వీలకు తగ్గింపు

  • పలువురు నేతలకు గన్ మెన్ల తొలగింపు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన శిల్పా సోదరులు
  • కక్ష సాధింపు చర్య అన్న చక్రపాణి రెడ్డి
కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది.

శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉపఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. మరోవైపు తన సోదరుడి కోసం ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. తమకు గన్ మెన్లను తొలగించడంపై శిల్పా సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు..
silpa mohan reddy
silpa chakrapani reddy
bhuma brahmananda reddy
sv mohan reddy
gunmen

More Telugu News