mohanlal: మలయాళ సూపర్ స్టార్ తో వెంకటేశ్?

  • మల్టీ స్టారర్ చేయడానికి ఉత్సాహం చూపించే వెంకీ 
  • మోహన్ లాల్ తో కలిసి ఓ మలయాళ మూవీ? 
  • తెలుగులో తేజ ప్రాజెక్టుతో సెట్స్ పైకి    
కథ కొత్తగా ఉండాలి .. కథనం ఆసక్తికరంగా ఉండాలే గానీ, ఇతర హీరోలతో కలిసి నటించడానికి వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపుతుంటారు. పవన్ .. మహేశ్ .. రామ్ వంటి హీరోలతో కలిసి చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. అలాంటి వెంకటేశ్ మోహన్ లాల్ తో కలిసి ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా సమాచారం.

 మలయాళంలో మోహన్ లాల్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకి గాను వెంకటేశ్ ను అడగడంతో, వెంటనే ఆయన ఓకే చెప్పేశారని అంటున్నారు. కథలోని వైవిధ్యం కారణంగానే ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ సినిమాల్లో జగపతిబాబు .. శ్రీకాంత్ లు కీలకమైన పాత్రలు చేశారు. ఇక ఇప్పుడు మోహన్ లాల్ తో వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్న మాట. తెలుగులోనూ తేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి వెంకటేశ్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.     
mohanlal
venkatesh

More Telugu News