Sri Lanka: రెండు వికెట్లు కోల్పోయి అర్ధసెంచరీ మార్కు దాటిన శ్రీలంక!

  • తొలి ఇన్నింగ్స్ లో 108 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక
  • భువనేశ్వర్ 2 వికెట్లు
  • నిలదొక్కుకునే ప్రయత్నంలో తిరుమన్నె, మాథ్యూస్
కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టుమ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండడంతో ఏమాత్రం తొందరపడకుండా ఆడుతున్నారు. లంక ఇన్నింగ్స్ ను సమరవిక్రమ (23) కరుణరత్నె (8) ప్రారంభించారు. అద్భుతమైన ఇన్ స్వింగర్ తో కరుణరత్నెను ఎల్బీడబ్ల్యూ చేసిన భువనేశ్వర్ కుమార్, సమరవిక్రమ బలహీనతను అవకాశామగా చేసుకుని, ఊరించే బంతిని వేసి కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన తిరుమన్నె (18), మాథ్యూస్ (5) నిలకడ ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రెండో సెషన్ లో శ్రీలంక జట్టు రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే 108 పరుగులు వెనకబడి ఉంది. 
Sri Lanka
India
Cricket
kolkata

More Telugu News