kolkata: కోల్ కతా పేవ్ మెంట్ బతుకులు: కామాంధుల బారి నుంచి కుమార్తెలను కాపాడుకునే చిట్కా!

  • ఉపాధి కోసం కోల్ కతా చేరుతున్న గ్రామీణులు 
  • రాత్రి ఫుట్ పాత్ పైనే నిద్రిస్తున్న యువతులపై యువకుల అత్యాచారాలు  
  • కామాంధుల బారి నుంచి రక్షించుకునేందుకు ముఖాలకు మసి పూస్తున్న తల్లిదండ్రులు

పొట్టచేతబట్టుకుని మహానగరానికి చేరుతున్న నిర్భాగ్యులు అత్యాచారాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కోల్‌ కతా నగరంలో గత కొంతకాలంగా ఆరుబయట రోడ్లు, ఫుట్‌ పాత్‌ లపై నిద్రిస్తున్న అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాంధులు, తాగుబోతులు, స్థానిక రౌడీలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో కీచకుల బారినుంచి వారిని కాపాడుకునేందుకు యువతుల తల్లిదండ్రులు తమ పిల్లలు నిద్రపోయేముందు వారి ముఖాలకు నూనెలో బూడిదను కలిపి రాస్తున్నారు. తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు ఇంతకంటే మరో మార్గం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాలు ఉపాధిని వెతుక్కునేందుకు కోల్ కతాకు వలస వెళ్తున్నారు. వారంతా గూడులేని పరిస్థితుల్లో అక్కడే ఫుట్ పాత్ లపై నిద్రించి, తెల్లవారాక పనులకు వెళ్తుంటారు. మళ్లీ సాయంత్రం ఆ ప్రాంతంలో కలుసుకుంటారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని పలువురు యువకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిట్కా వాడుతున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News