Gary: వెళ్లిపోయావా ‘గేరీ’.. మేక చనిపోయిన బాధలో లక్షలాదిమంది!

  • లక్షలాదిమందిని శోక సంద్రంలో ముంచిన మేక
  • సోషల్ మీడియాలో స్టార్.. 17 లక్షల మంది ఫాలోవర్లు
  • సంతాపం తెలిపిన లక్షలాదిమంది

ఓ మేక తాను చనిపోతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని శోకసంద్రంలో ముంచింది. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఆస్ట్రేలియాకు చెందిన ఆ మేక పేరు ‘గేరీ’. సోషల్ మీడియాలో స్టార్. 2013లో ఈ మేక గురించి ప్రపంచానికి తెలిసింది. సిడ్నీ మ్యూజియం బయట ఉన్న పూలను తినేయడంతో దానికి రూ. 28 వేల జరిమానా విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గేరీ’ గురించి తెలిసింది.

జరిమానా విధించడంతో దాని యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఆయన విజయం సాధించారు. ‘గేరీ’కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఓ ట్రావెలింగ్ కామెడీ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. దీంతో దానిపేరు మార్మోగిపోయింది. ఏకంగా 17 లక్షల మంది ఫాలోవర్లుగా మారిపోయారు. కొందరైతే దాని ఫొటోలను తమ శరీరంపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు.

గత కొంత కాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న గేరీ చనిపోవడంతో దాని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంతాపం తెలుపుతూ సందేశాలు  పంపారు. ట్యూమర్‌కు దీర్ఘకాలంగా చికిత్స ఇప్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అది కానరాని లోకాలకు వెళ్లిపోయిందని దాని యజమాని జేమ్స్  డిజార్నెల్డ్స్ కన్నీటి పర్యంతమయ్యాడు.

More Telugu News