padmavathi: క‌ళాకారుల‌పై దాడులు చేస్తామ‌న‌డం స‌రైందా?: ‘పద్మావతి’ సినిమాపై ప్ర‌కాశ్‌రాజ్

  • ‘పద్మావతి’ సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌మే అంటోన్న‌ రాజ్‌పుత్‌ కర్ణిసేన
  • కళాకారులను హెచ్చరిస్తోన్న తీరు ఆందోళనకరం
  • అశ్లీల చిత్రాల‌ను ఖండించ‌ని వారు చారిత్రాత్మ‌క చిత్రాన్ని ఖండిస్తున్నారు

దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌మే అంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌ప్పుబ‌ట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తోన్న‌ హెచ్చరికలు ఆందోళనకరమ‌ని ట్వీట్ చేశారు. అన్ని భాష‌ల్లోనూ య‌థేచ్ఛ‌గా వ‌స్తోన్న‌ అశ్లీల చిత్రాల‌ను ఖండించ‌ని వారు చారిత్రాత్మ‌క చిత్రంలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు స‌రైంద‌ని ప్ర‌కాశ్‌రాజ్‌ ప్రశ్నించారు.

మ‌రోవైపు క‌ర్ణిసేన ఈ విష‌యంపై ఏ మాత్రం త‌గ్గడం లేదు. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోంది. ఈ సినిమాలో న‌టించిన దీపికా ప‌దుకునే ముక్కుకోయాల‌ని ఒకసారి, ఆమెను చంపితే రూ.5 కోట్లు ఇస్తామ‌ని మరొకసారి క‌ర్ణిసేన ప్రతినిధులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.       

More Telugu News