Chandrababu: ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది: విశాఖ‌ప‌ట్నంలో చ‌ంద్ర‌బాబు

  •  అగ్రిటెక్ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో పాల్గొన్న బిల్‌గేట్స్‌
  •  విశాఖ‌లో బిల్‌గేట్స్‌కు స్వాగ‌తం ప‌ల‌కడం ప‌ట్ల చంద్ర‌బాబు హ‌ర్షం
  •  బిల్‌గేట్స్ త‌న సంపాద‌న‌లో ఎక్కువ భాగం స‌మాజం కోసం ఖ‌ర్చు చేస్తున్నారు

విశాఖ‌ప‌ట్నంలో అగ్రిటెక్ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో క‌లిసి మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు, మంత్రులు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... తాను అప్ప‌ట్లో హైద‌రాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ కంపెనీని తీసుకొచ్చానని చెప్పారు. బిల్‌గేట్స్ త‌న సంపాద‌న‌లో ఎక్కువ భాగం స‌మాజం కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు చెప్పారు.

బిల్‌గేట్స్ త‌న సంపాద‌న‌లో వార‌సుల‌కి ఇచ్చింది చాలా త‌క్కువ అని తెలిపారు. కాగా, విశాఖ‌ప‌ట్నం అంద‌మైన, స్వ‌చ్ఛమైన న‌గ‌రం అని, పెట్టుబ‌డుల‌కు కూడా ఇక్కడ మంచి అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయానికి తాము ఆధునిక సాంకేతిక‌త‌ను వాడుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ రోజు త‌న‌కు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బిల్‌గేట్స్ విశాఖ‌ప‌ట్నానికి రావ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News