amaravathi: అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్... షరతులతో కూడిన అనుమతి నిచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్

  • పర్యావరణ నిబంధనలను పక్కాగా పాటించాలి
  • కొండవీటి వాగు, కృష్ణానది ప్రవాహాలనకు ముప్పు లేకుండా చూసుకోవాలి
  • కరకట్టలను ముందుకు జరపరాదు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడి నిర్మాణాలను చేపట్టాలని సూచించింది. అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్జీటీ నేడు తుది తీర్పును వెలువరించింది.

పర్యవేక్షణ కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని, నిర్మాణ పనులపై నెలనెలా సమీక్ష జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. కొండవీటి వాగు దిశను మార్చినా, దాని ప్రవాహానికి ముప్పు లేకుండా చూసుకోవాలని తెలిపింది. కరకట్టలను ముందుకు జరపరాదని, కృష్ణానది ప్రవాహానికి అడ్డంకులు కలిగించరాదని షరతు విధించింది. పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను పకడ్బందీగా అమలు  చేయాలని పేర్కొంది.

More Telugu News