omar abdullah: మా నాన్న మాటలు తప్పని నిరూపించండి... రెచ్చగొట్టిన ఒమర్ అబ్దుల్లా!

  • పీవోకే పాకిస్థాన్ దేనన్న ఫరూఖ్ అబ్దుల్లా
  • పీవోకేను చేజిక్కించుకోవాలనుకుంటే ఎవరూ ఆపలేరన్న కేంద్రమంత్రి 
  • తన తండ్రి మాటలు తప్పని నిరూపించాలని ఫరూఖ్ అబ్దుల్లా సవాల్ 
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్థాన్ కు చెందినదేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ తీవ్రస్థాయిలో స్పందించారు. పీవోకేను భారత్ చేజిక్కించుకోవాలనుకుంటే ఎవరూ ఆపలేరని తెలిపారు.

దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ పీవోకేను వెనక్కి తీసుకురావాలని సూచించారు. తన తండ్రి (ఫరూఖ్ అబ్దుల్లా) మాటలను తప్పని చేతల్లో నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. ‘మేం ప్రయత్నిస్తే’ అని అంటున్నారు. దాని అర్థమేమిటో ఎవరికీ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. 
omar abdullah
faruq abdullah
hansraj aahir

More Telugu News