sasikala: శశికళ మాస్టర్ మైండ్.. పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా?

  • భర్త అనారోగ్యం సాకుగా చూపి ఐదురోజుల పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ
  • వ్యక్తిగత పనులు చక్కబెట్టిన వైనం 
  • 622 ఆస్తులను ఇతరుల పేర బదిలీ చేయించిన చిన్నమ్మ 
అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల ఐదు రోజుల పెరోల్ పై అనారోగ్యంతో బాధపడుతున్న భర్త నటరాజన్‌ ను చూసేందుకు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శశికళ మాస్టర్ మైండ్ వినియోగించారు.  

భర్త అనారోగ్యం కారణం చూపి పెరోల్ పై బయటకు రాగానే ఒకే ఒక్కసారి భర్త వద్దకు వెళ్లిన ఆమె ఆ తర్వాత వ్యక్తిగత పనులు చూసుకున్నారు. అందులో భాగంగా 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చారు. ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో ఆమె నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు గుర్తించినట్టు తమిళనాట వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం.
sasikala
natarajan
perol
assets exchange

More Telugu News