ramgopal verma: వామ్మో.. మైండ్ బ్లోయింగ్.. సూపర్ డూపర్ సెలక్షన్!: నంది అవార్డులపై రాంగోపాల్ వర్మ సెటైర్లు

  • నంది అవార్డుల కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
  • 1% పక్షపాతం కూడా లేకుండా అవార్డ్స్ ఇచ్చిన కమిటీ ఇదేనేమో! 
  • 'టైటానిక్' జేమ్స్ కెమరూన్ 'లెజెండ్' బోయపాటి శ్రీను కాళ్ళు పట్టుకుంటాడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలనాలకు కేరాఫ్‌‌ అడ్రస్ గా పేరొందిన రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా స్పందించాడు.  "నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా... వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..

నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్.. నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్" అంటూ పోస్ట్ చేశాడు.

అలాగే, మరో పోస్టులో "టైటానిక్ జేమ్స్ కెమరూన్ లెజెండ్ బోయపాటి శ్రీను కాళ్ళు పట్టుకుంటాడు. లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్థమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు...నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు" అన్నాడు. ఇప్పటికే నంది అవార్డుల ఎంపిక పెను కలకలం రేపుతుండగా, వర్మ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అవుతున్నాయి.

More Telugu News