Pakistan: చర్చించుకుందాం రండి.. భారత్ కు స్నేహహస్తం చాచిన పాకిస్థాన్!

  • చతుర్భుజ కూటమి ఏర్పాటుతో దిగివచ్చిన పాక్ 
  • భారత్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన 
  • భారత్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న దాయాది దేశం  

కశ్మీర్ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ ప్రకటించారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, భారత్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. కాగా, పాకిస్థాన్ లో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుకు చతుర్భుజ (అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్) కూటమి ఏర్పాటే కారణమని తెలుస్తోంది.

చైనాకు చెక్ పెట్టే దిశగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశాలు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఈ ప్రకటన చేయడం విశేషం. అంతే కాకుండా పాక్ సైనిక చట్టాల ప్రకారం మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన తరువాత ఒక వ్యక్తిని ఎవరినీ కలవనిచ్చేది లేదని ప్రకటించిన ఆ దేశం.. మానవతా దృక్పథంతో కుల్ భూషన్ జాదవ్ తల్లిని కలిసేందుకు అనుమతిచ్చామని ప్రకటించారు.  

More Telugu News