hyper aadi: కత్తి మహేష్ తాను సెలబ్రిటీని అని అనుకుంటున్నాడు!: హైపర్ ఆది ఎద్దేవా

  • కత్తి మహేష్ ఎవరో తెలియదు
  • స్కిట్ లో సుత్తి రాజేష్ గురించి పంచ్ డైలాగులు పెట్టాను
  • కత్తి మహేష్ క్యూట్ గా ఉన్నాడు

కత్తి మహేష్ ఎవరో తనకు తెలియదని, నిన్ననే సినిమా ప్రివ్యూ సందర్భంగా చూశానని 'జబర్దస్త్' ఫేమ్ హైపర్ ఆది అన్నాడు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, కత్తి మహేష్ కు పొట్ట, బట్ట లేదని అన్నాడు. ఆయన చాలా క్యూట్ గా ఉన్నాడని, ఆయనను క్యూట్ బోయ్ అంటానని చెప్పాడు. కత్తి మహేష్ ను దృష్టిలో పెట్టుకుని తాను పంచ్ డైలాగులు వేయలేదని, తాను తమ ఊర్లో ఉన్న సుత్తి రాజేష్ గురించి వ్యాఖ్యానించానని అన్నాడు.

సుత్తి రాజేష్ ఇల్లిల్లూ తిరుగుతూ పని చేసుకుని బతుకుతాడని, ఫేస్ బుక్ లో ఏది పడితే అది అంటాడని అన్నాడు. తన వీడియోలు కోటి మంది చూస్తారని, కత్తి మహేష్ రివ్యూలు లక్ష మంది చూస్తారని అన్నాడు. కత్తి మహేష్ తాను సెలబ్రిటీని అని అనుకుంటున్నాడని హైపర్ ఆది ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయి కత్తి మహేష్ కు లేదని అన్నాడు.

తన ఫోటో పెట్టి ఫ్యాన్స్ కు 'మేము మేము ఇలా కలిసిపోతాము.. మధ్యలో వెధవలయ్యేది మీరే'నని వ్యాఖ్యానించాడని, తాము ఫ్యాన్స్ ను అలా అనమని అన్నాడు. స్క్రిప్టు రాయాలంటే చాలా కష్టమని, అంత కష్టపడి సినిమా తీస్తే అది బాగో లేదనడానికి కత్తి మహేష్ ఎవరని ఆది ప్రశ్నించాడు. 

More Telugu News