airtel: అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే రెండు స్మార్ట్‌ఫోన్‌ల‌ను విడుద‌ల చేసిన ఎయిర్‌టెల్‌!

  • జియోకి పోటీగా స్మార్ట్‌ఫోన్లు
  • ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేరిట విడుద‌ల
  • రూ.1,799, రూ.1,849కే 4జీ స్మార్ట్‌ఫోన్లు

‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌, కార్బన్‌ మొబైల్స్‌ సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుద‌ల చేశాయి. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ ఫోన్‌లను వ‌రుస‌గా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల అస‌లు ధ‌రలు రూ.4,390, రూ.4,290 గా ఉన్నాయి. రిల‌య‌న్స్ జియో ఇటీవ‌లే కేవ‌లం 1500 రూపాయ‌ల‌కే అందించిన విష‌యం తెలిసిందే.

జియో నుంచి వ‌స్తోన్న పోటీని ఎదుర్కోవ‌డానికి ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంవో రాజ్‌ పూడిపెద్ది ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తాము కార్బన్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను అమెజాన్‌లో కూడా అందిస్తామ‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News