roja: మా అమ్మాయి సైంటిస్టు, మా అబ్బాయి ఆర్టిస్టు అవుతారట‌!: ఎమ్మెల్యే రోజా

  • మా కుటుంబంలో ఆర్టిస్టులు ఎవరూ లేరు
  • అయిన‌ప్పటికీ సినీరంగంలోకి ప్ర‌వేశించాను
  • మొద‌ట బాగా చ‌దువుకోవాల‌ని మా అబ్బాయికి చెబుతా
  • మా అమ్మాయి శాస్త్ర‌వేత్త అవుతుంద‌ట‌

ఆర్టిస్టుగా త‌మ‌ కుటుంబంలో ఎవ్వ‌రూలేక‌పోయిన‌ప్ప‌టికీ తాను సినీరంగంలోకి ప్ర‌వేశించాన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందు త‌న‌ను దేవుడే సినిమాల్లోకి తీసుకొచ్చాడని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించే అవ‌కాశాన్ని సినిమాల ద్వారా క‌ల్పించాడని అన్నారు. త‌న‌కు ఇంట్లో అంత‌గా ఇబ్బందులేవీ ఉండ‌బోవ‌ని చెప్పారు.

త‌న‌ను త‌న భ‌ర్త చాలా అర్థం చేసుకుంటారని రోజా చెప్పారు. తానే ఒక్కోసారి బ‌య‌ట ఉన్న టెన్ష‌న్ల‌వల్ల విసుక్కుంటానేమోగానీ త‌న భ‌ర్త ఏమీ అన‌ర‌ని తెలిపారు. త‌మ‌ అమ్మాయి సైంటిస్ట్ కావాల‌ని అనుకుంటోంద‌ని, త‌న కుమారుడు మాత్రం ఆర్టిస్టు లేక‌ పొలిటిషియ‌న్ అవుతాన‌ని అంటున్నాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మొద‌ట బాగా చ‌దువుకోవాల‌ని చెబుతాన‌ని చెప్పారు. 

More Telugu News