Revanth Reddy: కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని ఫుట్ బాల్ ఆడుకుంటారు: బీజేపీ నేత సంకినేని

  • కాంగ్రెస్ లో రేవంత్ ను ఆడుకుంటారు
  • జానారెడ్డి, కోమటిరెడ్డిలాంటి వారు కూడా బీజేపీలోకి రావచ్చేమో
  • తెలంగాణలో టీడీపీ లేదు
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఫుట్ బాల్ ఆడుకుంటారని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లో ఎదగాలనుకోవడం సహజమేనని... అయితే, ఇప్పుడున్న పార్టీలకు సిద్ధాంతాలు లేకుండా పోయాయని... ఉన్న పార్టీల్లోనే మంచి పార్టీని ఎంచుకోవాలని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ప్రస్తుతానికి టీడీపీ లేదని... టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే, ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తారని చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో చేరారని చెప్పారు. రాష్ట్రంలోని చాలా మంది ముఖ్య నేతల కుమారులు బీజేపీ వైపు చూస్తున్నారని... జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి బలమైన నేతలు కూడా బీజేపీలోకి రావచ్చేమో అని ఆయన అన్నారు. 
Revanth Reddy
sankineni venkateswara rao
bjp
congress

More Telugu News