Jagan: క‌ర్నూలు జిల్లాలో రైతు బాలిరెడ్డితో జగన్ మాటామంతీ.. రైతులకు గిట్టుబాటు ధర లేదని విమర్శలు!

  • 10వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌
  • క‌ర్నూలు జిల్లా చింత‌కుంట‌లో వైసీపీ అధినేత‌
  • రైతులు, విద్యార్థుల‌తో ముచ్చ‌ట‌
  • రైతులు దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని ఆవేద‌న‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాద‌యాత్ర 10వ రోజుకు చేరుకుంది. క‌ర్నూలు జిల్లా చింత‌కుంట‌లో జ‌గ‌న్ రైతులు, స్థానికుల‌తో మాట్లాడి వారి క‌ష్టాల‌ను గురించి తెలుసుకున్నారు. అక్క‌డి రైతు బాలిరెడ్డితో కాసేపు మాట్లాడి, ప‌లు వివ‌రాలు తెలుసుకున్నారు. చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లో రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని జగన్ అన్నారు. ఒక్క మొక్క‌జొన్న పంట‌కు మాత్ర‌మే గిట్టుబాటు ధ‌ర వస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతోన్నప్పటికీ, ప్ర‌భుత్వం ప‌ట్టీప‌ట్ట‌న‌ట్లు ఉంటోందని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత తాను అన్ని పంట‌ల‌కూ గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాన‌ని చెప్పారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి రైతుల జీవితాలు పోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

కాగా, ఈ రోజు జ‌గ‌న్‌ని గ్రూప్ -1 కు అర్హత సాధించిన అభ్యర్థులు క‌లిశారు. 2011 నుంచి ఉద్యోగాలు రాక ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన జ‌గ‌న్‌... ఏపీపీఎస్సీ సెక్రటరీ దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

More Telugu News