nandi awards: ఇక నల్లమలుపు బుజ్జి వంతు... 'రేసుగుర్రం' చిత్రానికి అవార్డులు ఇవ్వలేదని విమర్శలు

  • అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నా
  • పూర్తి ఏకపక్షంగా అవార్డుల ప్రకటన
  • నిప్పులు చెరిగిన నిర్మాత నల్లమలుపు బుజ్జి
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మూడేళ్ల నంది అవార్డులపై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వివాదాన్ని మరింతగా పెంచుతూ అవార్డుల కమిటీపై నిప్పులు చెరిగారు. అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'రేసుగుర్రం' చిత్రానికి అవార్డులు లభించక పోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని తాను ఊహించానని, అవార్డుల కమిటీ ఈ చిత్రాన్ని ఎందుకు విస్మరించిందో తెలియడం లేదని అన్నారు. తాము ఆశించిన విధంగా జరగలేదని చెప్పారు. ఏకపక్షంగా నంది అవార్డులు ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోందని విమర్శలు గుప్పించారు.
nandi awards
nallamalupu bujji
resugurram

More Telugu News