krishna river: బోటు ప్రమాదం... సానుభూతి కోసం కొత్త డ్రామా మొదలు పెట్టిన కొండల్ రావు!

  • అయ్యప్ప మాల వేసుకుని లొంగిపోయిన కొండల్ రావు
  • లొంగిపోవడానికి గంట ముందు మాల
  • విషయం తెలుసుకుని హెచ్చరించిన పోలీసులు
కృష్ణా నదిలో 22 మంది మృతికి కారణమైన బోటింగ్ కంపెనీ యజమాని తనపై సానుభూతి కోసం కొత్త డ్రామా మొదలు పెట్టగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. కేసు తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రివర్ బోటింగ్ ఎండీ కొండలరావు అయ్యప్ప మాల వేసుకుని పోలీసులకు లొంగిపోయాడు.

అయితే, లొంగిపోవడానికి గంట ముందు ఆయన మాల వేసుకున్నట్టు తెలుసుకున్న పోలీసులు, అరెస్ట్ చేసిన తరువాత మాల తీసివేయాలని కోరగా, తొలుత అందుకు అంగీకరించని కొండలరావు, ఆపై మాల తీసివేశాడు. అయ్యప్ప మాల వేసుకుని ఏది చెప్పినా నిజాలే అవుతాయని నమ్మించే ప్రయత్నం ఆయన చేశాడని, తాము దాన్ని అడ్డుకున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
krishna river
boat capasises
kondal rao

More Telugu News