shivaji raja: తనికెళ్ల భరణితో కలిసి ఫారిన్ వెళ్లాను .. అప్పుడు జరిగిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను: శివాజీ రాజా

  • తనికెళ్ల భరణితో మంచి సాన్నిహిత్యం వుంది 
  • ఇద్దరం కలిసి విదేశాలకి వెళ్లాం 
  • ఎక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేసినా కలవలేదు
  • 11 రోజుల పాటు అదే పరిస్థితి
తాజగా ఐ డ్రీమ్స్ తో శివాజీ రాజా మాట్లాడుతూ .. కొన్ని సరదా సంఘటనలను గురించి ముచ్చటించారు. తనికెళ్ల భరణితో కల్సి తాను ఫారిన్ వెళ్లినప్పటి సంగతిని ప్రస్తావించారు. "తనికెళ్ల భరణి .. నేను చాలా సన్నిహితంగా ఉంటాం. మా ఇద్దరి మధ్యా మంచి రిలేషన్ వుంది. అందువలన నేను .. భరణి ఇద్దరం కలిసి సింగపూర్ .. హాంకాంగ్ .. బ్యాంకాక్ వెళ్లాము. చెన్నై నుంచి మేము కొత్తగా హైదరాబాద్ వచ్చిన రోజులవి. అప్పటికి భరణికి పెళ్లై రెండు మూడేళ్లు అవుతోంది. నాకు పెళ్లై ఐదారు నెలలు అవుతోంది"

 "ఫారిన్ కి వెళ్లిన రెండు రోజుల తరువాత ఇంటికి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. బ్యాంకాక్ .. హాంకాంగ్ .. సింగపూర్ ఇలా ఎక్కడి నుంచి ట్రై చేసినా కలవడం లేదు .. 11 రోజుల పాటు ఇదే పరిస్థితి. ఇక సింగపూర్ ఎయిర్ పోర్ట్ నుంచి కాసేపట్లో ఇండియాకి బయల్దేరతామనగా ఎయిర్ పోర్ట్ లోని బూత్ లోకి వెళ్లి, అక్కడున్న ఆవిడతో హైదరాబాద్ కి ఫోన్ కలపమన్నాడు భరణి. వెంటనే కలిసింది .. మాట్లాడేశాము. మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు కలవలేదంటే, భరణి చెన్నై కోడ్ కొట్టి .. హైదరాబాద్ లోని నెంబర్ కొడుతూ వస్తున్నాడు. ఆయనకి అన్నీ తెలుసని నేను ఊరుకోవడం వలన ఇలా జరిగిపోయింది" అంటూ నవ్వేశారు.          
shivaji raja
thanikella bharani

More Telugu News