earth quake: హైదరాబాదు జూబ్లీహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు!

  • జూబ్లిహిల్స్ లో కంపించిన భూమి
  • భూకంపకేంద్రం కేబీఆర్ పార్క్
  • 0.5 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు
  • భయపడాల్సిన అవసరమేమీ లేదన్న ఎన్జీఆర్ఐ అధికారులు
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైనది కాదని, దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్పారు. భూకంప కేంద్రం కేబీఆర్ పార్క్ లో ఉన్నట్టు వారు తెలిపారు. కాగా, ఇళ్లలో ఉన్నవారు ఈ ప్రకంపనలను గుర్తించి, భయాందోళనలతో ఇళ్లలోంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. 
earth quake
Hyderabad
jubleehills

More Telugu News