nandamuri balakrishna: అవార్డుల పంటపై ఆనందం వ్యక్తం చేసిన బాలకృష్ణ

  • 'లెజెండ్'కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందం కలిగించింది
  • అవార్డులు గెలుచుకున్న అందరికీ శుభాకాంక్షలు
  • ఫిబ్రవరి 24, 25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు
తాను నటించిన 'లెజెండ్' సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. నంది అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర నీటి విధానం అమలుతో హిందూపురం నియోజకవర్గంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. పారిశ్రామికంగా అనంతపురం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతోందని... స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. 
nandamuri balakrishna
nandi awards
hindupuram
lepakshi utsavalu

More Telugu News