KTR: కేటీఆర్‌లా వేషం వేసి.. చేతులు ఎత్తి అభివాదం చేస్తోన్న చిన్నారి.. అబ్బుర‌ప‌రుస్తోన్న ఫొటోలు!

  • బాల‌ల దినోత్స‌వం రోజున చిన్నారుల సంబ‌రం
  • పాఠశాల‌ల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
  • త‌నలా వేషం వేసిన పాప ఫొటోల‌కు మంత్రి కేటీఆర్ ఫిదా

మన ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని భార‌త్‌లో ఈ రోజు బాల‌ల దినోత్స‌వం జ‌రుపుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిన్నారులు కృష్ణుడు, ఏసుక్రీస్తు, శాంతాక్లాజ్, వివేకానందుడు, గాంధీజీ వంటి వేషాలు వేసి త‌మ పాఠ‌శాల‌ల్లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. రాజ‌కీయ నాయ‌కుల వేషాలు కూడా వేసి అచ్చం వారిలా న‌టిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌లా వేషం వేసి, చేతులు ఎత్తి అభివాదం చేస్తోన్న ఓ చిన్నారి ఫొటోలు అబ్బుర‌ప‌రుస్తున్నాయి.  

త‌మ పాఠశాలలో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొన్న ఈ పాప ఫొటోలు కేటీఆర్ వ‌ద్ద‌కు చేరాయి. ఐరా అనే రెండేళ్ల చిన్నారి అచ్చం త‌న‌లాగే దుస్తులు ధరించి పాఠశాల వేడుకల్లో పాల్గొందని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపారు. ఆ పాప తల్లిదండ్రులు త‌న‌కు ఈ ఫొటోల‌ను పంపించారని చెప్పారు. ఈ పాప ఫొటోలు త‌న‌కు ఎంత‌గానో న‌చ్చాయ‌ని పేర్కొన్నారు. 



     

More Telugu News