Jagan: బీసీ నేతను జగన్ తాత ఎలా హత్య చేశారో అందరికీ తెలుసు!: కంభంపాటి

  • బీసీ నేత జింకా వెంకటేశ్వర్లుని హత్య చేశారు
  • అసెంబ్లీలో టీడీపీ సభ్యులే విపక్షపాత్రను కూడా పోషిస్తున్నారు
  • ప్రతి హామీని నెరవేరుస్తున్నాం
బీసీల సంక్షేమం గురించి వైసీపీ అధినేత జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు విమర్శించారు. బీసీ నేత అయిన జింకా వెంకటేశ్వర్లుని జగన్ తాత ఎలా హత్య చేశారో అందరికీ తెలుసని చెప్పారు. రోడ్డున పడ్డ జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం అత్యంత దారుణమని చెప్పారు.

 శాసనసభలో ప్రతిపక్షం లేకపోయినా... ప్రజా సమస్యలపై చర్చించే క్రమంలో, టీడీపీనే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తోందని అన్నారు. టీడీపీ సభ్యులే ప్రతిపక్ష నేతలుగా ప్రశ్నలను సంధిస్తున్నారని... ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.
Jagan
kambhampati rammohan rao
YSRCP
Telugudesam

More Telugu News