ఎన్టీఆర్ తో కాదు .. నితిన్ తోనే 'శ్రీనివాస కల్యాణం'
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
- ముందుగా నాగ్ తో చేయాలనే ఆలోచన
- ఆ తరువాత ఎన్టీఆర్ కి కథ వినిపించిన దిల్ రాజు
- చివరికి హీరోగా నితిన్ ఖరారు
ముందుగా ఈ కథను నాగార్జునతో చేయాలని భావించారుగానీ కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ కి కథ చెప్పారు .. ఆయనకి కథ నచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ, హీరోగా ఇప్పుడు నితిన్ పేరు వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ కథను నితిన్ కి వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే పనుల్లో వున్నారు. 'దిల్' రాజు ఇంటి పేరుగా మారిపోయిన 'దిల్' సినిమా, గతంలో ఆయన నితిన్ తో చేసిందే.