lakshmi parvathi: చంద్రబాబు సిగ్గుపడాలి.. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరు: లక్ష్మీపార్వతి

  • కేతిరెడ్డిని చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయించలేదు?
  • 1993లో విడాకులు తీసుకున్నా
  • సినిమా పోస్టర్ చాలా నీచంగా ఉంది

ఎన్టీఆర్ ను అగౌరవపరిచేలా సినిమా తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయించలేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ విషయంపై చంద్రబాబు సిగ్గుపడాలని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడటానికి కేతిరెడ్డిలాంటి వారికి ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. తన పేరుతో సినిమా తీసేటప్పుడు, తన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? అన్నారు.

1993 జూన్ 20వ తేదీన తాను విడాకులు తీసుకున్నానని... విడాకులు తీసుకున్న వ్యక్తితో ముడిపెట్టి తన చరిత్రను సినిమా తీయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని వ్యక్తి పేరును తన పక్కన పెట్టి సినిమా తీస్తుండటం నీచమని అన్నారు. సినిమా పోస్టర్ అయితే అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇంత కుసంస్కారంతో సినిమాను తెరకెక్కిస్తారా? అని అన్నారు. తల్లి, చెల్లి ఉన్న ఎవరూ కూడా ఇంత నీచంగా వ్యవహరించరని తెలిపారు. కేతిరెడ్డిలాంటోళ్లు ప్లాట్ ఫామ్ గాళ్లని, కోన్ కిస్కాగాళ్లని... వీళ్ల వెనుక వేరే వ్యక్తులు ఉన్నారని... వాళ్లకు తగలాలనే తాను ఈ మాటలు మాట్లాడుతున్నానని చెప్పారు. తనను ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని, ఇలాంటి సినిమాలతో ఎన్టీఆర్ ఆత్మ ఎంతో క్షోభిస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు.  

  • Loading...

More Telugu News