వందశాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతా.. స్పష్టం చేసిన హార్ధిక్ పాండ్యా
- శ్రీలంక సిరీస్‌కు పాండ్యా దూరం
- విశ్రాంతి పేరుతో దూరం పెట్టిన సెలక్టర్లు
- తానే విశ్రాంతి అడిగానన్న ఆల్ రౌండర్
జట్టు నుంచి తనను తప్పించలేదని, తానే విశ్రాంతి కోరానని స్పష్టం చేశాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో శరీరం కొంత ఇబ్బంది పెడుతోందని తెలిపాడు. ఈ కారణంగానే విశ్రాంతి కోరినట్టు పేర్కొన్నాడు. తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని భావించినప్పుడే బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. ఈ విరామం సమయంలో ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు.