jet airways: విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ప్రయాణికుడి బెదిరింపు

  • కేరళలోని కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌
  • స‌ద‌రు ప్ర‌యాణికుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన సిబ్బంది
  • రెండు గంటలు ఆలస్యంగా బ‌య‌లుదేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం

కేరళలోని కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు క‌ల‌క‌లం రేపాడు. ముంబయికి బయలుదేరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అత‌డిని ప‌ట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అత‌డి బెదిరింపుల‌ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా బ‌య‌లుదేరింది.

ఈ ఘటనపై స్పందించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు.. ప్రయాణికుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవ‌ల జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన‌ విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ ప్ర‌యాణికుడు బెదిరింపు లేఖను ఉంచి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  

More Telugu News