anil ravipoodi: మల్టీ స్టారర్ లో హీరోలను ఇంకా ఖరారు చేయలేదు : అనిల్ రావిపూడి

  • 'రాజా ది గ్రేట్' తో తాజా హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 
  • తదుపరి సినిమాగా మల్టీ స్టారర్ 
  • హీరోలుగా వెంకటేశ్ .. సాయిధరమ్ తేజ్ అంటూ ప్రచారం
  • స్పందించిన అనిల్ రావిపూడి         

వరుస హిట్స్ ను అందుకుంటూ దూసుకుపోతోన్న టాలీవుడ్ దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా కనిపిస్తున్నాడు. 'రాజా ది గ్రేట్' తో తాజా విజయాన్ని అందుకున్న ఆయన, తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. 'ఎఫ్ 2' అంటే 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'.

ఒక హీరో పాత్ర ఫన్ గా కొనసాగితే .. మరో హీరో పాత్ర ఫ్రస్ట్రేషన్ తో నడుస్తుందని అంటున్నారు. ఈ మల్టీస్టారర్ లో వెంకటేశ్ ఒక హీరోగా .. సాయిధరమ్ తేజ్ మరో హీరోగా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు.

ఈ సినిమాకి సంబంధించి హీరోలను ఇంకా ఖరారు చేయలేదనీ, కథానాయకుల ఎంపిక పూర్తయిన తరువాత తానే చెబుతానని అన్నాడు. మరి ఈ మల్టీ స్టారర్ లో హీరోలుగా ఎవరిని తీసుకుంటారో, కథానాయికలుగా ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.  

  • Loading...

More Telugu News