Amitabh Bachchan: ఎక్కడ పడ్డానో అక్కడి నుంచే జీవితం మొదలు పెట్టాను: స్ఫూర్తి నింపే ఫ్లాష్ బ్యాక్ పోస్టు పెట్టిన అమితాబ్

  • కూలీ సినిమా సందర్భంగా చోటుచేసుకున్న ఘటనను గుర్తు చేస్తూ స్ఫూర్తి నింపిన అమితాబ్ 
  • పంచ్‌ పడగానే పడిపోయాను. చచ్చిపోయాననే అనుకున్నాను.
  • కానీ బతికి బయటపడ్డాను. కోలుకున్నాను.
  • ఎక్కడైతే పడ్డానో అక్కడి నుంచే జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టాను.
తన సామాజిక మాధ్యమం నుంచి బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ ఎన్నో స్పూర్తిమంతమైన పోస్టులు పెడుతుంటారు. తాజాగా అభిమానుల్లో స్ఫూర్తి నింపే ఫ్లాష్ బ్యాక్ ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయనేమన్నారంటే...  ‘కూలీ' చిత్రీకరణ సమయంలో పంచ్‌ పడగానే పడిపోయాను. చచ్చిపోయాననే అనుకున్నాను. కానీ బతికి బయటపడ్డాను. కోలుకున్నాను. ఎక్కడైతే పడ్డానో అక్కడి నుంచే జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టాను. నాపై పడిన పంచ్‌ కి తిరిగి నేను పంచ్‌ ఇచ్చాను. లేవండి పోరాడండి. ఎప్పటికీ తలవంచవద్దు’ అంటూ ట్వీట్ చేసిన ఆయన 'కూలీ' సినిమాలో ఫైట్ సన్నివేశానికి సంబంధించిన ఫోటోను జతచేశారు.

 ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా, కూలీ సినిమా ఫైట్ సీన్ చిత్రీకరణ సమయంలో ఆయన కడుపులో దెబ్బ తగిలి కొన్నాళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ సంఘటనను గుర్తుచేస్తూ ఆయన జీవన పోరాటంపై పోస్టు చేశారు.

కాగా, అమితాబ్‌ ప్రస్తుతం ‘102 నాటౌట్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.  
Amitabh Bachchan
tweet
Inspiring post

More Telugu News