boy friend death: మరణించిన ప్రియుడి 'జ్ఞాపకం' కోసం ఆస్ట్రేలియా యువతి పోరాటం.. సోషల్ మీడియాలో వైరల్!

  • పెళ్లికి ముందే మరణించిన ప్రియుడు డేవిస్ 
  • మరణించిన కొన్ని గంటల్లోనే ప్రియుడి వీర్యంతో బిడ్డని కంటానని న్యాయస్థానం అనుమతి కోరిన వైనం 
  • రెండు నెలల సుదీర్ఘ విచారణలో న్యాయస్థానానికి ఎన్నో ఆధారాలు సమర్పించిన ఐలా
  • అనుమతినిచ్చిన న్యాయస్థానం

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డేవిస్, ఐలా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే ఒక రోడ్డు ప్ర‌మాదంలో డేవిస్ మృతి చెందాడు. దీంతో చాలా మందిలా ఆమె అతనిని మర్చిపోయి కొత్తజీవితం ప్రారంభించాలని భావించలేదు. ప్రేమించుకున్నప్పుడు చేసుకున్న బాసలు నిజం చేయాలని భావించింది. దీంతో తన ప్రియుడి వీర్యంతో పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది. ఐవీఎఫ్ పధ్ధతిలో డేవిస్ వారసుడిని కనాలని నిర్ణయించుకుంది.

 దీంతో ప్రియుడు మరణించిన కొన్ని గంటల్లోనే అతనితో పిల్లల్ని కనేందుకు అనుమతినివ్వాలని న్యాయస్థానాన్ని వేడుకుంది. దీంతో కోర్టు అతని వీర్యాన్ని తీసి భద్రపరచమని ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై రెండు నెలల సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ రెండు నెలల విచారణలో న్యాయస్థానానికి ఐలా ఎన్నో ఆధారాల‌ను స‌మ‌ర్పించింది.  

దీంతో డేవిస్ వీర్యంతో పిల్లల్ని కనేందుకు న్యాయస్థానం అనుమతించింది. కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ విధానం (ఐవీఎఫ్‌) ద్వారా ఓ క్లినిక్‌ లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో సోషల్ మీడియాలో అరుదైన ప్రేమికురాలిగా ఐలా గుర్తింపు పొందింది. ఆమె ప్రేమ కథ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరణించిన ప్రియుడి బిడ్డ‌కు తల్లి కావాలన్న ఆమె నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. 

More Telugu News