ap tourism: బోటు ప్రమాదం జరగడానికి ముందు అసలేం జరిగిందో మీరూ చూడండి!

  • ప్రయాణికులను ఎక్కించుకోవడానికి వీల్లేదన్న టూరిజం అధికారి
  • బోటును తీసుకెళ్లిపోవాలంటూ విన్నపం
  • అక్కడ నుంచి వెళ్లిన బోటు భవానీ ఐలండ్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంది

19 మంది ప్రాణాలను బలితీసుకున్న పడవ ప్రమాదంలో విపక్షాలన్నీ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం అంటూ మండిపడుతున్నాయి. కానీ, ప్రమాదానికి ముందు ఏం జరగిందో తెలిస్తే ప్రభుత్వం, టూరిజం అధికారుల తప్పిదం ఏమీ లేదనే విషయం అర్థమవుతుంది.

ప్రమాదానికి కారణమైన బోటు నిర్వాహకులతో ఏపీ టూరిజం అధికారి వాగ్వాదానికి దిగారు. రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థ దుర్గా ఘాట్ నుంచి బోటును నడిపేందుకు ప్రయత్నించగా, ఏపీ టూరిజం అధికారి అడ్డుకున్నారు. అక్కడ బోటు నిలపడానికి కూడా వీల్లేదని ఆయన కరాఖండీగా చెప్పారు. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి మీకు అనుమతి లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆయన సదరు బోటు నిర్వాహకులకు దండం కూడా పెట్టారు. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తమ బోట్లు ఉన్నాయని, మీరు వెళ్లిపోవాలంటూ ఆయన స్పష్టం చేశారు. లేకపోతే బోటును ఇక్కడ నుంచి బలవంతంగా పంపించేస్తామంటూ హెచ్చరించారు. దీంతో, డ్రైవర్ బోటును తీసుకుని వెళ్లిపోయాడు.

ఇది జరిగిన కాసేపటికే అదే బోటు భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమంకు పర్యాటకులను ఎక్కించుకుని బయల్దేరింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా, అంతకు ముందే ఏపీ టూరిజం అధికారి హెచ్చరించినా లెక్క చేయకుండా... ప్రయాణికులను ఎక్కించుకుని, వారి జీవితాలతో ఆడుకుంది. అధికారుల మాటను బోటు నిర్వాహకులు విని ఉంటే, ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

More Telugu News