ట్రిపుల్ రైడింగ్ విషయంలో.. కీలక నిర్ణయం తీసుకోనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- ట్రిపుల్ రైడింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు
- ట్రిపుల్ రైడింగ్ చేస్తే, ముగ్గురుకీ జరిమానాలు
- నివేదికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న మరో ఇద్దరిపై కూడా జరిమానాలు విధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఒక నివేదికను రూపొందిస్తున్నారు. ముగ్గురిపైనా కేసులు నమోదు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నామని... ముగ్గురికి కూడా తలా ఒక వెయ్యి రూపాయలను జరిమానా విధించాలని కోరనున్నామని రాచకొండ అదనపు డీసీపీ (ట్రాఫిక్) దివ్యచరణ్ రావు తెలిపారు.