nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఆడియో తేదీ ఖరారైనట్టే!

  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • 'ఫిదా' తరువాత సాయిపల్లవి చేస్తోన్న సినిమా ఇదే 
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్  
  • ఈ నెల 25వ తేదీన ఆడియో రిలీజ్ కి సన్నాహాలు

 

నాని తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాటలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ విషయంపై అధికారిక ప్రకటనను వెల్లడించే అవకాశం వుంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3వ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'ఫిదా' హిట్ తరువాత సాయి పల్లవి చేస్తోన్న సినిమా ఇదే కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. ఇక నాని వరుస విజయాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.     

More Telugu News