earth quake: 7.3 తీవ్రతతో ఇరాన్, ఇరాక్ లో భారీ భూకంపం!

  • ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప్రాంతమైన హలాబ్జాలో భూకంప కేంద్రం
  • వందకు పైగా మృతులు, భారీ సంఖ్యలో క్షతగాత్రులు 
  • సహాయకచర్యలు ప్రారంభించిన రెండు దేశాలు

ఇరాన్‌-ఇరాక్‌ లలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంప కేంద్రం రెండు దేశాల సరిహద్దుల్లోని హలాబ్జాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంపం ధాటికి రెండు దేశాల సరిహద్దుల్లోని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రతకు వంద మందికి పైగా మృతి చెందగా, వేలాది మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలకింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, భూకంపం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు భవంతులు, లిఫ్ట్‌ లకు దూరంగా ఉండాలని ఇరాక్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషన్ ఇరాకీ స్టేట్‌ టీవీ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌, లెబనాన్‌, కువైట్‌, టర్కీలలో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది.

More Telugu News