అధికారుల కంటే మత్స్యకారులే నయం: ప్రత్యక్ష సాక్షులు
- ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు, స్థానికులు
- సంఘటనా స్థలికి వచ్చేసరికి అరగంట ఆలస్యం
- అప్పటికే బాధితులను ఆసుపత్రులకు తరలించిన స్థానికులు, మత్స్యకారులు
మత్స్యకారులు, స్థానికులే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారని పలువురు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎప్పటికో తీరిగ్గా అధికారులు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయని, ఆ తరువాత అధికారులు దానిని పర్యవేక్షించారని వారు అన్నారు.