krishna district: ఆ పాప బతికి బాగుండాలి: సహాయక చర్యల్లో పాల్గొన్న మత్స్యకారుడు

  • బోల్తా పడిన బోటులోంచి ఇద్దర్ని రక్షించానన్న మత్స్యకారుడు
  • వారిలో పాప ఉంది... నా చేతుల్లోనే వాంతులు చేసుకుంది
  • పాపను ఒడ్డుకు చేర్చి మళ్లీ బోటు వద్దకు వెళ్లాను
  • పాప గురించి ఆరాతీస్తే ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు

పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్థానిక మత్స్యకారులు పలువురిని కాపాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ మత్స్యకారుడు మాట్లాడుతూ, తాను ఇద్దర్ని బయటకు తీసుకొచ్చానని అన్నారు. అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక కూడా ఉందని ఆయన అన్నారు.

పాప చిన్నది కావడంతో షాక్ కు గురైందని, దీంతో తన చేతుల్లోనే వాంతులు చేసుకుందని ఆయన అన్నారు. పాపను ఒడ్డుకు చేర్చిన తరువాత మళ్లీ ఎవరినైనా కాపాడడం కోసం బోల్తాపడిన బోటు వద్దకు వెళ్లానని, తిరిగి వచ్చి పాప గురించి ఆరాతీశానని ఆయన అన్నారు. అప్పటికే ఆమెను ఆసుపత్రికి తరలించారని, పాప బతికి, బాగుండాలని ఆయన అన్నారు. వాంతులు చేసుకోవడంతో పాప ఎలా ఉందో? అని ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. 

More Telugu News