ys jagan: బోటు ప్రమాదంపై జగన్ స్పందన!

  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
  • పార్టీ పరంగా బాధితులకు అన్నీ చేస్తాం
  • మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి

విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది ఎంతో కలతను కలిగించే ఘోరమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేతలు వెంటనే అక్కడకు వెళ్లి, సహాయక చర్యల్లో పాల్గొనేలా చేస్తామని... పార్టీ తరపున ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. పాదయాత్రలో ఉన్న జగన్... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనపై స్పందించారు. 
ys jagan
YSRCP
vijayawada boat accident

More Telugu News