vijayawada: విజయవాడ బోటు ప్రమాదంలో కళ్ల ముందే భర్తను కోల్పోయిన భార్య.. చనిపోయినవారంతా వాకర్స్ క్లబ్ మెంబర్సే

  • ప్రమాదానికి గురైనవారంతా ఒంగోలు నుంచి వాకర్స్ క్లబ్ ద్వారా వచ్చారు
  • దాదాపు 40 మంది వరకు ఉన్నారు
  • భవానీ ద్వీపం వద్ద బయల్దేరిన కాసేపటికే ఘోరం
విజయవాడలో బోటు బోల్తా పడ్డ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 11 మంది మృత దేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో ఓ మహిళను ఎన్డీఆర్ఎఫ్ దళాలు సురక్షితంగా కాపాడాయి. అయితే, ఆమె భర్త మాత్రం ఆమె కళ్లముందే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది.

ఓ టీవీ ఛానల్ ప్రతినిధి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా... మాట్లాడే స్థితిలో తాను లేనంటూ కంటతడి పెట్టారు. అయినప్పటికీ ఘటనకు సంబంధించి కొంత సమాచారాన్ని ఆమె అందించారు. తామంతా ఒంగోలు నుంచి వచ్చామని, వాకర్స్ క్లబ్ తరపున వచ్చామని ఆమె చెప్పారు. దాదాపు 40 మంది వరకు ఉన్నామని తెలిపారు. అందరూ బంధువులు, స్నేహితులమే అని వెల్లడించారు. భవానీ ద్వీపం వద్ద బోటు ఎక్కామని, బయల్దేరిన కాసేపటికే ఘోరం జరిగిపోయిందని రోదించారు. 
vijayawada
vijayawada boat accident

More Telugu News