kuldeep yadav: ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా: క్రికెటర్ కుల్దీప్ యాదవ్

  • అండర్-15 జట్టులో స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యా
  • క్రికెట్ జోలికే పోకూడదనుకున్నా
  • కోహ్లీ, ధోనీల నుంచి మంచి మద్దతు ఉంది
టీమిండియా తాజా సంచలనం, లెఫ్టామ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. 13 ఏళ్ల వయసున్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పాడు. యూపీ అండర్-15 జట్టులో స్థానం సంపాదించడానికి తాను ఎంతగానో కృషి చేశానని... అయినా జట్టుకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పాడు.

ఇక జన్మలో మరోసారి క్రికెట్ జోలికి వెళ్లకూడదని అనుకున్నానని తెలిపాడు. తొలుత పేస్ బౌలర్ కావాలనుకున్నానని... అయితే కోచ్ సూచన మేరకు స్పిన్ ను ఎంచుకున్నానని వెల్లడించాడు. పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ లు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. కోహ్లీ, ధోనీల నుంచి తనకు ఎంతో మద్దతు లభిస్తోందని తెలిపాడు.
kuldeep yadav
team india

More Telugu News