ranveer singh: సోషల్ మీడియాలో పెను కలకలం రేపుతున్న రణ్ వీర్ సింగ్ వివాదాస్పద ట్వీట్!

  • నా మతాన్ని కోల్పోతున్నానని ట్వీట్ చేసిన రణ్ వీర్ సింగ్
  • సోషల్ మీడియాలో దీనిపై తీవ్రమైన చర్చ 
  • పద్మావతి వివాదం సద్దుమణగగానే రణ్ వీర్ సింగ్ వివాదం మొదలు
రాజ్ పుత్ ల హెచ్చరికలు, ఆందోళనల నేపథ్యంలో పద్మావతి సినిమాపై పెను వివాదం రేగిన సంగతి తెలిసిందే. సినిమాను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దానిని కొట్టేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

ఇదే సమయంలో ఈ సినిమాలో 'అల్లావుద్దీన్ ఖిల్జీ' పాత్ర పోషించిన నటుడు రణ్ వీర్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్టు ఒకటి పెనుకలకలం రేపింది. 'నా మతాన్ని నేను కోల్పోతున్నాను' అంటూ పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ లో ఉన్న ఫోటోను పోస్టు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 
ranveer singh
padmavathi
movie
tweet
controversy

More Telugu News