deepika padukone: శ్రీవారి సన్నిధిలో 'పద్మావతి' పూజలు.. తిరుమలలో సందడి చేసిన దీపికా పదుకొనే!

  • తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనే
  • డిసెంబర్ 1న సినిమా విడుదల
  • పద్మావతి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవ్వాలని కోరుకున్న దీపిక
తాను నటించిన 'పద్మావతి' హిందీ సినిమా విడుదల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ నటి దీపికా పదుకొనే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. వివాదాలు సద్దుమణిగి చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవ్వాలని ఆమె శ్రీవారిని వేడుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది.

మరోపక్క ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ 'రాజ్ పుత్ కర్ణి' సేన హెచ్చరిస్తోంది. అయితే, ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నప్పటికీ.. రాజ్ పుత్ కర్ణి సేన కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. సినిమా విడుదల కావాలంటే ముందుగా తమకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 నిబంధనల ప్రకారం తాము సినిమాను సెన్సార్ బోర్డుకి పంపిస్తామని, వారు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత ప్రదర్శనకు పంపిణీ చేస్తామని చిత్రయూనిట్ చెబుతోంది. విమర్శించిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పలేమని చిత్రయూనిట్ అభిప్రాయపడుతోంది. కాగా, నేడు 'పద్మావతి'కి సంబంధించిన కొత్త లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. దీనికి బాలీవుడ్ లోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. 
deepika padukone
tirupathi
prayears

More Telugu News