ntr: రామయ్యను దర్శించుకున్న ఎన్టీఆర్.. ఆలయం వద్ద తోపులాట!

  • సతీసమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న యంగ్ టైగర్
  • సీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ
  • ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
వరుస హిట్లతో దూసుకెళుతున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాచల రామయ్యను దర్శించుకున్నాడు. తన సతీమణి లక్ష్మీప్రణతితో కలసి ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నాడు. ఆలయం వద్దకు వెళ్లిన వీరికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములకు ఎన్టీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం వీరికి అర్చకులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రి విశిష్టతను తెలియజేశారు.

మరోవైపు, ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోపులాట కూడా జరిగింది. ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఎన్టీఆర్ కూడా తన అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని పలుకరిస్తూ తన దర్శనాన్ని ముగించుకున్నాడు.
ntr
junior ntr
lakshmi pranathi
Koratala Siva
bhadrachalam
ntr in bhadrachalam

More Telugu News