rajasekhar: ఆయన ఎక్కడ?... 'గరుడవేగ' నిర్మాత గురించి ఫిల్మ్ నగర్ చర్చ!

  • దూకుపోతోన్న 'గరుడ వేగ' 
  • నిర్మాత కోటీశ్వరరాజు మధ్యలోనే డ్రాప్?    
  • ఆ తర్వాత ప్రాజక్టును టేకప్ చేసిన రాజశేఖర్!   

చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గరుడ వేగ' .. ఆయనకి సక్సెస్ ను ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటే ఓవర్సీస్ లోను ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి నిర్మాతగా కోటీశ్వరరాజు వ్యవహరించారు. ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అనీ .. ఈ సినిమా కోసం 25 కోట్లకి పైగా ఖర్చు చేశారని జీవిత రాజశేఖర్ చెప్పారు. అయితే, నిర్మాత కోటేశ్వర రాజు ఒక్క ట్రైలర్ లాంచ్ సందర్భంలో మినహా మరెక్కడా కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్ విషయంలోను ఆయన లీడ్ తీసుకున్నది లేదు. సక్సెస్ టాక్ వచ్చిన తరువాత మీడియా ముందుకు వచ్చిందీ లేదు.

 దాంతో 25 కోట్లు పెట్టిన నిర్మాత ఇలా సైలెంట్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కోటీశ్వరరాజు మధ్యలోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే రాజశేఖర్ ఫ్యామిలీ టేకప్ చేసిందనీ, అందువల్లనే ఆ తరువాత వ్యవహారాలలో ఆయన జోక్యం చేసుకోలేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ప్రచారం సంగతి అటుంచితే ..  ఈ సినిమా రాజశేఖర్ కి సక్సెస్ ను అందించడం పట్ల ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

  • Loading...

More Telugu News