పాదయాత్రకు తొలి బ్రేక్.. సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్!
- తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న జగన్
- రోడ్డు మార్గంలో ప్రయాణం
- 10.30 గంటలకు కోర్టుకు హాజరు
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద నిన్న సాయంత్రం జగన్ పాదయాత్ర ముగిసింది. అక్కడ నుంచి కోర్టు విచారణ కోసం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నగరంలోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆయన చేరుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత... 10.30 నిమిషాలకు ఆయన కోర్టుకు చేరుకున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, మధ్యాహ్నం తర్వాత కూడా ఆయన కోర్టులోనే ఉండనున్నారు. విచారణ అనంతరం ఆయన మళ్లీ రోడ్డు మార్గంలో యర్రగుంట్ల ప్రాంతానికి చేరుకుంటారు.