winter: బారెడు పొద్దెక్కినా కనిపించని సూర్యుడు... ఒక్కసారిగా 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!

  • దక్షిణాదిపై తగ్గిన తుపాను ప్రభావం
  • విశాఖ జిల్లాలో 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
  • చలి తీవ్రత మరింతగా పెరుగుతుందంటున్న అధికారులు

దక్షిణాదిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత వారం పదిరోజులుగా తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాలను ఆవరించి, భారీ వర్షాలు కురిపించిన తుపాను ప్రభావం తగ్గడంతో ఆకాశంలో మేఘాలు మాయమై ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

గత రాత్రి, విశాఖ జిల్లా మినమలూరు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 14 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. పాడేరులో పొగమంచు దట్టంగా అలముకోవడంతో వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. తెలంగాణలోని రామగుండంలో 15 డిగ్రీలు, నిజామాబాద్, వరంగల్, భద్రాచలం ప్రాంతాల్లో 16 డిగ్రీలు, మెదక్, హైదరాబాద్ తదితర చోట్ల 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయించినా వెలుతురు కనిపించని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశాలు లేకపోవడంతో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చలికాలం కావడంతో విషజ్వరాలు, స్వైన్ ఫ్లూ వంటివి విజృంభించకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News