rashmi: నాకు ప్ర‌తి రోజు 50 రాంగ్ కాల్స్ వ‌స్తుంటాయి: 'జ‌బ‌ర్ద‌స్త్' రష్మీ

  • న‌న్ను విసిగించేవారి కోసం కొన్ని తిట్ల‌ను రెడీగా పెట్టుకుంటా
  • నేను రెజీనాలా ఉంటాన‌ని, కీర్తిరెడ్డిలా ఉంటాన‌ని కొంద‌రు అంటారు
  • ‘నెక్ట్స్‌ నువ్వే’లో చీర‌కట్టులో క‌నిపించా

ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే న‌వ్వుల కార్య‌క్ర‌మం 'జ‌బ‌ర్ద‌స్త్‌'లో యాంక‌ర్‌గా రాణించి, సినిమాల్లోనూ న‌టిస్తోన్న ర‌ష్మీ తాజాగా అదే ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే ఓ ప్రోగ్రాంలో పాల్గొని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది. త‌న‌ను కొంద‌రు న‌టి రెజీనాలా ఉంటాన‌ని, ఇంకొందరు కీర్తిరెడ్డిలా ఉంటాన‌ని అంటారని తెలిపింది. త‌న‌కు రోజుకు 50కు పైగా రాంగ్ కాల్స్‌ వస్తుంటాయని చెప్పింది.

త‌న‌కు ఫోన్లు చేసి విసిగించేవారి కోసం కొన్ని తిట్లు కూడా రెడీగా ఉంటాయని తెలిపింది. తాను న‌టించిన కొత్త సినిమా ‘నెక్ట్స్‌ నువ్వే’లో ‘గడ్డివాము దగ్గర కుక్క ఉంటుంది, తను తినదు.. ఇంకొకరిని తిననీదు’ అనే డైలాగ్‌ను ఎవరికి ఎలా కావాలంటే అలా ఊహించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ సినిమాలో చీర‌ కట్టుకుని నటించాన‌ని, త‌ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా ప‌డ్డాన‌ని చెప్పింది.

More Telugu News