Jana Reddy: అధికారంలోకి వ‌స్తే ఎంఐఎం మాతోనే ఉంటుంది: జానారెడ్డి

  • కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పొగుడుతోన్న అక్బ‌రుద్దీన్ ఒవైసీ
  • కౌంట‌ర్ ఇచ్చిన జానారెడ్డి
  • అక్బ‌రుద్దీన్ ప్ర‌భుత్వానికి డ‌బ్బా కొట్ట‌డంలో కొత్తేమీ లేదు
  • నియోజ‌క‌వర్గాల పెంపు ఇప్ప‌ట్లో అసాధ్యం  

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆకాశానికెత్తేస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రసంగించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టీఆర్ఎస్‌తో క‌లిసి ఎన్నిక‌లకు వెళ‌తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. అక్బ‌రుద్దీన్ తీరుపై కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి స్పందించారు. ఈ రోజు శాస‌న‌స‌భ ముగిసిన అనంత‌రం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ....అక్బ‌రుద్దీన్ ప్ర‌భుత్వానికి డ‌బ్బా కొట్ట‌డంలో కొత్తేమీ లేదని అన్నారు. గ‌తంలో త‌మ‌కు అనుకూలంగా కూడా ఆయ‌న మాట్లాడార‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తే ఎంఐఎం త‌మ‌తోనే ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నియోజ‌క వ‌ర్గాల పెంపు అసాధ్య‌మ‌ని జానారెడ్డి చెప్పారు. 2026 వ‌రకు నియోజ‌క వ‌ర్గాల పెంపు సాధ్యం కాదని, ఒక‌వేళ పెంచాల‌నుకుంటే చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News