innocence: మ‌రుగుతోన్న నూనెలో 10 మంది ఉద్యోగుల‌తో చేతులు పెట్టించిన యజమాని!

  • గుజ‌రాత్‌లో అనాగ‌రిక చ‌ర్య‌
  • దారుణానికి పాల్ప‌డ్డ ఎమ్మెల్యే కుమారుడు
  • త‌న పెట్రోల్ బంక్‌లో రూ.6 ల‌క్ష‌లు కొట్టేశార‌ని ఆరోప‌ణ‌
గుజ‌రాత్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే కుమారుడు అనాగ‌రికుడిలా ప్ర‌వ‌ర్తించాడు. తన పెట్రోల్ బంకులో రూ.6 ల‌క్ష‌లు మాయమయ్యాయని ఆరోపిస్తూ, వేడి వేడి నూనెలో 10 మంది ఉద్యోగులను చేతులు పెట్టమన్నాడు. అలా చేస్తే చోరీ ఎవ‌రు చేశారో తనకు తెలుస్తుంద‌ని న‌మ్మాడు. అతని ఆదేశానికి తలొగ్గిన ఉద్యోగులు అతను చెప్పిన ప్రకారం చొక్కాలు విప్పేసి, వరుసగా నిలబడి వేడి నూనెలో చేతులు పెట్టారు. చివరికి చేతులు కాల్చుకున్నారు.

 అహ్మ‌దాబాద్‌కి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే జంబుతా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే క‌రంసీ ప‌టేల్ కుమారుడు కాను ప‌టేల్ పాల్ప‌డ్డ ఈ దారుణం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  
innocence
boiling oil
Employees forced prove innocence

More Telugu News